అతన్ని చూసి అండర్ టేకర్ కూడా భయపడేవాడు..!

డబ్ల్యూడబ్ల్యూఈ లో అండర్ టేకర్ అంటే భయపడని వారంటూ ఎవరూ ఉండేవారు కాదు. అతను కళ్ళను లోపలికి లాగేయడం.. చనిపోయినట్లు నటించి ఉన్నట్లుండి బయటకు రావడం.. శవపేటిక నుండి లేసి వస్తుండడం చూసి పిల్లలైతే దడుచుకునేవారు..! ఆయన్ను డబ్ల్యూడబ్ల్యూఈ లో చూపించిన విధానం అటువంటిది. అలాంటి అండర్ టేకర్ కూడా ఓ రెజ్లర్ ను చూసి చాలా భయపడేవాడట.. అతను ఎవరో కాదు రేవన్..!

 

రేవన్ ఆటతీరును చూసి చాలా భయపడేవాడని ఓ ఇంటర్వ్యూలో అండర్ టేకరే చెప్పాడు. ఎందుకంటే రేవన్ రింగ్ లోకి వచ్చే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒంటి మీద ఏదేదో పూసేసుకొని.. చెత్త తీసుకొని వచ్చి తోటి రెజ్లర్ల మీద కూడా చల్లేవాడు. ఆ తర్వాత అతను రింగ్ లో చేసే మూవ్స్ కూడా అద్భుతంగా ఉండేవి. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ రావన్ ఆద్యంతం అలరించేవాడు. డబ్ల్యూడబ్ల్యూఈని వదిలిపెట్టిన తర్వాత టీఎన్ఏ, ఇంపాక్ట్ రెజ్లింగ్ లాంటి వాటిలో పాల్గొన్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి ముందు డబ్ల్యూసీడబ్ల్యూ లో కూడా రేవన్ ఉన్నాడు. కొద్ది సంవత్సరాల క్రితం రేవన్ గురించి ఎటువంటి వార్త కూడా వినిపించకపోవడంతో అతను చనిపోయాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈకి తిరిగి వచ్చాడు. రెండు సార్లు అతను డబ్ల్యూడబ్ల్యూఈ లో కనిపించాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ రెజ్లింగ్ కు మారాడు. సెప్టెంబర్ 8, 1964లో రేవన్ జన్మించాడు. నేడు ఆయన పుట్టినరోజు..!

About the author

Related

JOIN THE DISCUSSION