ఈ పిల్లాడి చేయిలో ఓ తేడా ఉంది.. ఆ తేడా వెనుక ఓ స్టోరీ ఉంది..!

ఈ పిల్లవాడి చేయి చూస్తే మీకు ఓ తేడా కనిపిస్తుంది.. బాగా పరిశీలించండి.. ఆ కనిపెట్టేశారూ..! అదేనండి ఆ పిల్లాడికి ఏకంగా ఆరు వేళ్ళు ఉన్నాయి. ఈ పిల్లాడు ఇటీవలే జన్మించాడు. కానీ తరతరాలుగా వారి కుటుంబంలో అందరికీ చేతికి ఆరు-ఆరు పన్నెండు వేళ్ళు, కాలికి కూడా పన్నెండు వేళ్ళు ఉన్నాయి. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులకు ఇలాగే ఉన్నాయి. దీంతో వీరి గురించి TLC టీవీ ఛానల్ ప్రత్యేకంగా ఓ కథనాన్ని టెలీకాస్ట్ చేసింది.

బ్రెజిల్ రాజధాని బ్రసీలియాకు చెందిన డిసిల్వా కుటుంబం. వీలు దొరికినప్పుడల్లా కలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇటీవలే వారింట్లో మరో పిల్లాడు పుట్టాడు. అయితే అతడికి కూడా ఆరు వేళ్ళు ఉండడం వారికి ఆనందాన్ని తెచ్చి పెట్టింది.

ఎందుకంటే డిసిల్వా కుటుంబంకు జెనెటిక్ డిజార్డర్ ఉంది. అదేమిటంటే వారి వంశంలో చాలా మందికి ఆరు వేళ్ళు ఉన్నాయి. వీరు ఈ జెనెటిక్ డిజార్డర్ ను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఒకరు వంట చేసేటప్పుడు, మరొకరు పియానో వాయించేటప్పుడు, ఇంకొకరు గిటార్ స్ట్రింగ్స్ ను నొక్కేటప్పుడు.. మరొకరు గోల్ కీపింగ్ చేసేటప్పుడు.. ఇలా చాలా వాటికి తమ ఆరు వేళ్ళను ఉపయోగిస్తూ ఉంటారు. జీన్స్ ప్రకారం వారికి ఒకరి తర్వాత ఒకరికి ఇలా తరతరాలుగా ఈ ఆరు వేళ్ళ కాంబినేషన్ వస్తూనే ఉన్నాయట. మొత్తం 14 మందికి ఇలా ఆరు-ఆరు వేళ్ళు వచ్చేశాయి.

https://www.youtube.com/watch?v=RBPQTGAC_z4

About the author

Related

JOIN THE DISCUSSION