కొడుకు క్రికెటర్ గా కోట్లు సంపాదించాడు.. తండ్రి ఇంకా బిస్కెట్లు అమ్ముతున్నాడు..!

ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ అభిమానులకు ఈయన తెలియకపోవడం అంటూ లేదు..! శ్రీలంక క్రికెట్ కు మురళీ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అలాగే వన్డేల్లోనూ, టెస్టులలోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మురళీ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక జట్టులో మురళీ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి.. క్రికెటర్ గా పేరు ప్రఖ్యాతలే కాకుండా డబ్బు కూడా బాగానే సంపాదించాడు. అయితే అతని తండ్రి మాత్రం ఇప్పటికీ బిస్కెట్లు అమ్ముతూ ఉంటాడంటే మీరు నమ్మరేమో..!

అలాగని మురళీ తన తండ్రిని చిన్న చూపు చూడడం లేదు.. ఎందుకంటే మురళీ తండ్రి ‘సిన్న సామీ’ కి సింపుల్ గా ఉండడమే ఇష్టం.. ఆయన ఓ చిన్నపాటి బిస్కెట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళతో కలసి మెలసి ఉంటారు. అప్పుడప్పుడు ఆయనే బయటకు వెళ్ళి బిస్కెట్లను అమ్ముతుంటారు కూడా.. అలాగని తన బిస్కెట్ల కంపెనీ ప్రచారానికి మురళీ బ్రాండ్ ను ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు.

అదే గనుక మురళీ పేరును ఉపయోగించుకుంటే మీ బిస్కెట్ల ఫ్యాక్టరీ రెండింతలు అయ్యేది కదా అని ఆయన్ను అడిగితే.. తాను తన కొడుకు పేరును ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదని.. నా అవసరం కోసం కొడుకుకు నష్టం కలిగించాలని కోరుకోవడం లేదని తెలిపారు. మురళీధరన్ దగ్గర శ్రీలంకలోనే అతిపెద్ద బిస్కెట్ కంపెనీ యొక్క ఎండార్స్మెంట్ ఉంది.. ఒకవేళ అతని ఫోటోను ఉపయోగించుకుంటే తన కొడుక్కు చెడ్డపేరని కూడా ఆయన అన్నారు. కానీ పల్లెకెలే వాసులకు మాత్రం ఆ బిస్కెట్ల కంపెనీ మురళీధరన్ వాళ్ళదేనని తెలుసు..!

About the author

Related

JOIN THE DISCUSSION