ర‌క్త‌మోడిన సిరియా

ర‌క్త‌మోడిన సిరియా

అంత‌ర్యుద్ధంతో అల్లాడుతున్న సిరియా మ‌రోసారి ర‌క్త‌మోడింది. తిరుగుబాటుదారులు పేట్రేగిపోయారు. ట‌ర్కీ-సిరియా స‌రిహ‌ద్దుల్లో ఉన్న అజ‌జ్ ప‌ట్ట‌ణంలో చ‌మురు ట్యాంకును పేల్చివేశారు. ఈ ఘ‌ట‌న‌లో 60 మంది మృత్యువాత ప‌డ్డారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు ఇప్ప‌టిదాకా ఏ ఉగ్ర‌వాద సంస్థా ప్ర‌క‌టించ‌లేదు. ర‌ష్యా-ట‌ర్కీ సంయుక్త బ‌ల‌గాలు నిర్వ‌హిస్తోన్న కాల్పుల‌కు ప్ర‌తీకారంగా తిరుగుబాటుదారులు ఈ ఘ‌తుకానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. మృతుల్లో ఆరుగురు తిరుగుబాటుదారులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. పేలుడు ధాటికి భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. సంఘ‌ట‌నా స్థ‌లం భ‌యాన‌కంగా మారింది. అజ‌జ్ ప‌ట్ట‌ణాన్ని త‌మ గుప్పిట్లో తెచ్చుకోవ‌డానికి కొన్నాళ్లుగా ఐసిస్ స‌హా తిరుగుబాటుదారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *