ప‌నిచేసే చోట వేధింపుల‌కు మ‌రో ఉద్యోగిని బ‌లి

ఎంత చ‌దువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా.. మ‌హిళ‌ల‌కు మాత్రం వేధింపులు ఆగ‌ట్లేదు. ప‌నిచేసే చోట వేధింపుల ఉదంతానికి మ‌రో యువ‌తి బ‌లైంది. త‌న ఉన్న‌తాధికారి వేధింపుల‌ను భ‌రించ‌లేక‌, ఎవ‌రితోనూ చెప్పుకోలేక ఓ యువ‌తి ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. క‌ర్ణాట‌క మంగ‌ళూరులోని ఉల్లాల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ యువ‌తి పేరు స్ఫూర్తి. ఫ‌ళ్నీర్ గ్రామంలోని ఆసుప‌త్రిలో బీమా విభాగంలో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగం చేస్తోంది. రెండు నెల‌ల కింద‌టే ఆమె ఉద్యోగం చేరింది. ఏడాది పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఉద్యోగంలో చేరిన త‌రువాత ఎవ‌రికైనా కొంత బెరుకు, భ‌యం ఉంటుంది. దీన్ని తొల‌గించాల్సిన అధికారులు ఆమెను సూటిపోటి మాట‌ల‌తో వేధించారు.

రోజురోజూ ఈ వేధింపులు తీవ్ర‌త‌ర‌మ‌వుతూ వ‌చ్చాయి. ఉద్యోగాన్ని వ‌దిలేద్దామ‌నుకుంటే- ఏడాది పాటు కాంట్రాక్టు ఉంది. దీనితో ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో స్ఫూర్తి ఆత్య‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌నుకుంది. ఉల్లాల్‌లోని త‌న నివాసంలో త‌ల్లిదండ్రులు లేని స‌మ‌యంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉల్లాల్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION