కుటుంబం మొత్తం పాడె ఎక్కింది.. కార‌ణం?

ఓ కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌ల్లిదండ్రులు, ఎదిగొచ్చిన కుమారుడు, కుమార్తె..ఇలా అంద‌రూ ఒక్క‌సారిగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఒకే చితిపైకి చేరారు. దీనికి కార‌ణం- ఆ కుటుంబం పెద్ద కుమార్తె.

త‌మ కుమార్తె దిగువ కులానికి చెందిన యువ‌కుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంద‌నే ఒకే ఒక్క కార‌ణంతో ఆ కుటుంబంలోని న‌లుగురూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో చోటు చేసుకుంది.

ఉద‌య్‌పూర్ జ్యోతిన‌గ‌ర్ కాల‌నీలో ఉండే వినోద్ శ‌ర్మ ఉపాధ్యాయులు. ఆయ‌న, ఆయ‌న భార్య క‌ల్ప‌న‌, చిన్న కుమార్తె ఆర్జూ, కుమారుడు నిఖిల్ పురుగుల మందును సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వినోద్ శ‌ర్మ పెద్ద కుమార్తె కోమ‌ల్‌.. దిగువ కులానికి చెందిన యువ‌కుడిని ప్రేమించింది..

కోర్టు తీర్పు మేర‌కు అత‌ణ్ణే పెళ్లాడింది. దీనితో ప‌రువు పోయింద‌నే ఆవేద‌న‌తో వినోద్‌శ‌ర్మ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు చెబుతున్నారు. కోమ‌ల్ ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యంలోనే త‌న తోటి విద్యార్థిని ప్రేమించింద‌ని వినోద్‌శ‌ర్మ ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.

ప‌దో త‌ర‌గ‌తి నుంచి ప్ల‌స్ టూ, ఆ త‌రువాత డిగ్రీ వ‌ర‌కు క‌లిసి చ‌దివార‌ని, దీనితో వారిద్ద‌రిని విడ‌దీయ‌లేనంతంగా ప్రేమించుకున్నార‌ని అంటున్నారు. ఈ విష‌యం వినోద్‌శ‌ర్మ‌కు తెలిస్తే- ఆయ‌న దీనికి అంగీక‌రించ‌లేదు.

అయిన‌ప్ప‌టికీ- కోమ‌ల్ త‌న‌కు న‌చ్చిన వాడితో పెళ్లి చేసుకోవ‌డానికి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. రిజిస్ట‌ర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుంది. దీనితో కుటుంబం ప‌రువు పోయింద‌నే ఆవేద‌న‌తో వినోద్ శ‌ర్మ ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్నాడ‌ని చెబుతున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION