అమ్మాయిల శవాల పక్కన తల్లి ఏడుస్తూనే ఉంది.. రాత్రంతా వారి పక్కన నుండి కదలలేదు..!

ఆ తల్లికి అనుకోని కష్టం వచ్చింది… తన ప్రపంచమనుకున్న బిడ్డలు కొన్ని నిమిషాల్లో ఆమెకు దూరమైపోయారు. జరిగిన ఘోరాన్ని తలుచుకుని ఆమె గంటల పాటు ఏడ్చింది. తన బిడ్డలు ఈ లోకంలో లేరన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. తన కూతుళ్ళ శవాలపై పడి గంటల తరబడి ఏడుస్తూనే ఉంది. రాత్రంతా వారి పక్కన నుండి అసలు కదలలేదు.. ఆమెను సముదాయించడానికి ఒక్కరు కూడా ముందుకురాలేకపోయారు.

భోపాల్ కు 35 కిలోమీటర్ల దూరంలో హకీమ్ ఖేడీ అనే గ్రామం ఉంది. అక్కడ ఉన్న ఓ చెరువులో నలుగురు అమ్మాయిలు స్నానం చేద్దామని వెళ్ళారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో జారి పడ్డారు. ఒకర్ని కాపాడాలని మరొకరు ప్రయత్నిస్తూ.. నలుగురూ లోతట్టు ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ముగ్గురు మునిగిపోగా… ఈత తెలిసిన ఓ యువతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. నీళ్ళల్లో పడ్డ వారిని రక్షించడానికి గ్రామస్థులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పొద్దు పొడుస్తున్న సమయంలో వారి శవాలను బయటకు తీశారు. చనిపోయిన మహిళల్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు.. మరొక అమ్మాయి వాళ్ళ మామ కూతురు. చనిపోయిన అమ్మాయిల్లో వందన అనే అమ్మాయి పెళ్ళి నాలుగు నెలల క్రితం ఏప్రిల్ 24న జరిగింది. రక్షాబంధన్ రోజున ఆమె ఇంటికి వచ్చింది. తన చెల్లెళ్ళతో కలసి ఆమె పొలానికి వెళ్ళి తిరిగివస్తుండగా చెరువులో స్నానం చేయాలని భావించి నీళ్ళలో మునిగి మృత్యువాత పడ్డారు.

వందన, సంజన, మోహన్ బాయి చనిపోగా.. ఈత వచ్చిన మోనికా వారిని కాపాడడానికి ప్రయత్నించి అలసిపోయింది. బయటకు వచ్చి అందరికీ సమాచారం ఇచ్చింది మోనికా.. ఆ తర్వాత ఆమె కళ్ళ ముందరే జరిగిన ఘోరాన్ని చూసి మోనికా మూర్చబోయింది. ఇక వారింట రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.. వందన,సంజనల తల్లి కొన్ని గంటల పాటు వారి శవాల పక్కనే కూర్చొని రోదిస్తూనే ఉంది..!

About the author

Related

JOIN THE DISCUSSION