ఉదయం అతని పెళ్ళి.. ఇలా జరుగుతుందని ఒక్కరు కూడా ఊహించి ఉండరు..!

మరికొన్ని గంటల్లో అతని పెళ్ళి.. అంతకు ముందు జరగాల్సిన అన్ని పనులూ పూర్తీ అవుతున్నాయి. ఇంతలో అతనికి రొమ్ములో విపరీతమైన నొప్పి మొదలైంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.. ఇంతలో అతను చనిపోయాడనే వార్త ఆ పెళ్ళి మంటపంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటివరకూ బంధుమిత్రుల అల్లర్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఫంక్షన్ హాల్ లో రోదనలు మిన్నంటాయి.

మిరాజ్ పట్టణానికి చెందిన 25 ఏళ్ల రవీంద్ర పిసే అనే వ్యక్తికి కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన యువతితో పెళ్ళి ఫిక్స్ చేశారు. పెళ్ళి సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయి. పెళ్ళి కొడుకు-పెళ్ళి కూతుళ్ళకు పసుపు పూసే కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. ఇద్దరు కుటుంబాలకు చెందిన వారు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. పెళ్ళి కొడుకు, కూతురు ఇద్దరూ కూడా కళ్యాణ మంటపానికి చేరుకున్నారు. ఇంతలో రవి ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. వెంటనే కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు కారులో అతన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. డాక్టర్లు అతన్ని పరిశేలించిన తర్వాత అప్పటికే చనిపోయాడని తేల్చారు. గుండెపోటు కారణంగా ఆ యువకుడు మరణించాడని చెప్పారు. ఈ వార్త తెలియగానే పెళ్ళికూతురు కుటుంబం నిశ్చేష్టులయ్యారు. రవి మరణవార్తతో ప్రతి ఒక్కరూ విషాదంలో నిండిపోయారు.

About the author

Related

JOIN THE DISCUSSION