నెల రోజుల్లో జీఎస్టీ వసూళ్ళు.. 92 వేల కోట్లు..!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసే ముందు ఎన్నో అనుమానాలు.. ఎందుకు ఇలాంటి కొత్త పన్నులు… అవసరమా..? అని కూడా చాలా మంది అడిగారు. కానీ మొదటి నెలలో వచ్చిన జీఎస్టీ వసూళ్ళు చూసి ఆనాడు ప్రశ్నించిన వారే నేడు నోళ్ళు మూసుకున్నారు. జూలైలో రూ. 92,283 కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 59.57 లక్షలమంది పన్ను చెల్లింపుదారుల్లో 38.38 లక్షల మంది ఇప్పటి వరకు జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఆలస్యంగా పన్ను చెల్లించే వారికి రోజుకు రూ.100 చొప్పున లెవీ విధించనున్నట్టు మంత్రి హెచ్చరించారు. తాము పెట్టుకున్న టార్గెట్ 91వేల కోట్ల రూపాయలు మాత్రమేనని.. అయితే దాన్ని ఎప్పుడో దాటి పోయామని ఆయన చెప్పారు.

About the author

Related

JOIN THE DISCUSSION