భారత క్రికెట్ అభిమానులు క్షమించమని వేడుకుంటున్నారు..!

ఆసీస్ గౌహతిలో టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత కొందరు వ్యక్తులు వారి బస్సుపై రాళ్ళు విసిరారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. క్రికెట్ అభిమానులు ఈ పని చేసిన వారు మూర్ఖులు అంటూ విమర్శించారు. ఎవరో కొందరు దుండగులు చేసిన పనికి అందరినీ అనడం తప్పని.. తాము క్రికెటర్లకు ఎంతో మర్యాద ఇస్తామని చెప్పారు. ఈ విషయంపై గౌహతిలో ఉన్న అభిమానులు కూడా క్షమాపణ చెబుతూ కనిపించారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు చేరిన వందలాది మంది యువతీ యవకులు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని, ఓ తుంటరి చేసిన పనికి, రాష్ట్ర యువతంతా క్షమించాలని వేడుకుంటోందని వారు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION