నీటి గుంత‌లో ఈత‌కు వెళ్లాడు..మ‌ళ్లీ తిరిగి రాలేదు!

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విశ్వవిద్యాల‌యం క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లో వ‌ర్ష‌పు నీటితో నిండి ఉన్న ఓ భారీ గుంత‌లో ఈత‌కు వెళ్లిన ఓ విద్యార్థి దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ఆ విద్యార్థిని ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఆకాశ్‌ సేన్ గుప్తాగా గుర్తించారు.

గ‌త విద్యా సంవ‌త్స‌రంలోనే అత‌ను హెచ్‌సీయూలో చేరాడు. ఎంఏ సోషియాల‌జీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తోటి స్నేహితులతో కలిసి యూనివర్సిటీలో ఉన్న నీటికుంటలో రాత్రి ఈతకు వెళ్లాడు.

ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు, హెచ్‌సీయూ సిబ్బంది అతన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About the author

Related

JOIN THE DISCUSSION