హైదరాబాద్ లో భారీవర్షం

హైదరాబాదులోని పలు చోట్ల భారీ వర్షం నమోదయ్యింది. ఎండలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు వర్షం కాసింత ఉపశమనాన్ని కలిగించింది. మే కూడా రాకుండానే 40 డిగ్రీలకు చేరిన హైదరాబాద్ వాతావరణం వర్షంతో కాస్త చల్లారినట్లు కనిపిస్తోంది.

సోమవారం హైదరాబాదును చిరుజల్లులతో తడిపిన వరుణుడు, మంగళవారం సాయంత్రం మాత్రం భారీ వర్షం కురిపించాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాంనగర్, విద్యానగర్, అంబర్‌పేట, రామాంతపూర్, బాగ్ లింగంపల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం నీటి కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

About the author

Related

JOIN THE DISCUSSION