మంత్రాలయం నుండి బెంగళూరుకు రాకపోకలు బంద్..!

మంత్రాలయం నుండి బెంగళూరుకు రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. పత్తికొండ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. అలాగే ఆదినారాయణ రెడ్డి నగర్ కూడా నీట మునిగింది. మోకాలు లోతులో పలు కాలనీలు ఉన్నాయి. చిన్న హుల్తి గ్రామంలో సగం వరకూ నీటిలో నిండిపోయింది.

కర్నూలు జిల్లాకు కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో జిల్లాలోని పలు కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే నదులలో కూడా నీటి తాకిడి ఎక్కువగా ఉండడంతో మళ్ళీ ఎక్కడ కర్నూలు నీట మునుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇక శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,47,369 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 88,344 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 855 అడుగులు.

About the author

Related

JOIN THE DISCUSSION