ఇర్మా ఎఫెక్ట్‌! అట్లాంటిక్ మ‌హా స‌ముద్రం..మాయం!

అంతెక్క‌డో తెలియ‌ని, భూమ్యాకాశాల‌ను ఏకం చేసే ఓ మ‌హా స‌ముద్రం మాయం కావ‌డం ఎప్పుడైనా చూశారా? స‌ముద్రం మాయం కావ‌డ‌మ‌నే మాట‌నే ఊహించ‌లేం కదా? అది వాస్త‌వ రూపం దాల్చింది. స‌ముద్రం అక్ష‌రాలా మాయ‌మైంది. కొన్ని గంట‌ల పాటు క‌నిపించ‌కుండా పోయింది. అది కూడా స‌ప్త స‌ముద్రాల్లో ఒక్క‌టైన అట్లాంటిక్ మ‌హా స‌ముద్రం.

దీనికి కార‌ణం. హ‌రికేన్ ఇర్మా. క‌రీబియ‌న్ దీవుల‌ను చెల్లా చెదురు చేసేసిన హ‌రికేన్ ఇర్మా ధాటికి స‌ముద్రం కొన్ని కిలోమీట‌ర్ల మేర వెన‌క్కి వెళ్లింది. కనుచూపు మేరలో సముద్రం ఉందని చెబితే ఎవ‌రూ న‌మ్మ‌లేని విధంగా మాయ‌మైంంది. క‌రీబియ‌న్ దీవుల్లో ఒక్క‌టైన బ‌హ‌మాస్‌లో ఈ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది.

స్థానిక యువ‌కుడొక‌రు దీన్ని వీడియో త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. సుమారు 1 గంటల త‌రువాత ఆ సముద్రం మళ్లీ తిరిగి య‌థాస్థితికి చేరుకుంది. హరికేన్ ఇర్మా సృష్టించిన విల‌యం వ‌ల్ల స‌ముద్ర‌పు నీరు అత్య‌ధిక ఒత్తిడికి గురై ఉంటుంద‌ని, స‌ముద్ర‌పు నీటిని ఇర్మా తన వైపునకు లాక్కొవడం వల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION