భ‌ర్త గారి గాళ్‌ఫ్రెండ్ భ‌ర‌తం ప‌ట్టింది..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళా మ‌ఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ కాదు. ఓ సాధార‌ణ గృహిణి. త‌న భ‌ర్తతో వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకున్న మ‌హిళను చిత‌గ్గొట్టింది. పోలీసుల‌కు ప‌ట్టిచ్చింది. ఆమెతో పాటు రెడ్‌హ్యాండెడ్‌గా చేతికి చిక్కిన‌ట్టే చిక్కి ప‌రారైన త‌న భ‌ర్త‌పైనా కేసు పెట్టిందా గృహిణి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌ర‌గావ్‌లో చోటు చేసుకుంది.

 

 

మీనాక్షి రావ‌త్ అనే మ‌హిళ త‌న భ‌ర్త తేజ్‌సింగ్ రావ‌త్‌తో క‌లిసి ఖ‌ర‌గావ్‌లోని చ‌మేలీ ప్రాంతంలో నివాసం ఉంటోంది. వారికి ఓ కుమార్తు. ఆమె విక‌లాంగురాలు. తేజ్‌సింగ్ రావ‌త్ వ్యాపారి. స్థానికంగా అత‌నికి రెండు వ‌స్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో- తేజ్‌సింగ్‌కు ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

 

అది కాస్త అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. త‌ర‌చూ తేజ్‌సింగ్ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చిన మీనాక్షి రావ‌త్‌.. ప‌లుమార్లు అత‌ణ్ణి నిల‌దీసింది. మూడునెల‌ల కింద‌ట‌ తేజ్‌సింగ్ వివాహేత‌ర సంబంధం విష‌యం ఆమె దృష్టికి వ‌చ్చింది. దీనితో ఆమె ప‌లుమార్లు అత‌నితో గొడ‌వ పెట్టుకుంది.

వివాహేత‌ర సంబంధాన్ని తెంచుకోవాల‌ని కోరింది. అయిన‌ప్ప‌టికీ- తేజ్‌సింగ్ వినిపించుకోలేదు. రెండు రోజుల కింద‌ట తేజ్‌సింగ్.. త‌న బంధువుల ఇంట్లో శుభ‌కార్యం ఉంద‌ని, బుర‌హాన్‌పూర్ వెళ్తున్నానంటూ బ‌య‌లుదేరాడు. భ‌ర్తపై ఓ క‌న్నేసి ఉంచిన మీనాక్షి రావ‌త్‌.. అత‌నికి తెలియ‌కుండా అనుస‌రించింది.

తేజ్‌సింగ్ బుర‌హాన్‌పూర్ వెళ్ల‌కుండా.. ఖ‌ర‌గావ్‌లోనే ఓ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తోన్న మ‌హిళ వ‌ద్ద‌కు వెళ్లాడు. అప్ప‌టిదాకా గ‌మ్మున ఉన్న మీనాక్షి రావ‌త్‌.. కాళికా అవ‌తారం ఎత్తింది. త‌న తండ్రిని వెంట‌బెట్టుకుని ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. డోర్ బెల్ కొట్ట‌గా.. తేజ్‌సింగే త‌లుపు తీశాడు.

అంతే! అత‌నిపై విరుచుకుప‌డిందామె. చెప్పుల‌తో కొడుతూ వెంట‌ప‌డింది. ఆమె ధాటికి తాళ‌లేక తేజ్‌సింగ్ పారిపోగా.. ఆమె మాత్రం మీనాక్షి చేతికి చిక్కింది. ఆమెనూ వ‌ద‌ల్లేదు మీనాక్షి. ఆమెపైనా చేయి చేసుకుంది. ఖ‌ర‌గావ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు తేజ్‌సింగ్‌, ఆ మ‌హిళ‌పై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

 

About the author

Related

JOIN THE DISCUSSION