ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ గేమ్ అడ్మిన్ ను పట్టేశారు.. కానీ ఎవరు నడిపిస్తున్నారు..?

ఎందరో పిల్లల ప్రాణాలు తీస్తున్న పాడు గేమ్ అది.. చేయకూడని పనులన్నీ చేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడే గేమ్ అది..! ఒక్క సారి ఆట ఆడటం మొదలుపెట్టారో.. ప్రాణం పోయే దాకా ఆపలేమని ఆ గేమ్ ఆడి ఆత్మహత్యలు చేసుకున్న వారు తమ సూసైడ్ నోట్ లలో రాసి పెట్టారు. గత కొంత కాలంగా రష్యా దేశాన్ని వణికించిన ఈ గేమ్ ఇప్పుడు భారత్ ను కూడా తాకింది. ఎందఱో పిల్లల ప్రాణాలను మింగేస్తోంది.

అయితే ఈ గేమ్ అడ్మిన్ ను పోలీసులు ఎప్పుడో అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం జూన్ నెలలోనే ఇలియా సిదొరోవ్ అనే వ్యక్తిని మాస్కోలో అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. 26 సంవత్సరాల సిదరోవ్ వెనుక ఇంకా 32 మంది వ్యక్తులు ఉన్నారట.. మెయిన్ వ్యక్తి అయిన సిదరోవ్ ను అరెస్ట్ చేస్తే మొత్తం గ్యాంగ్ ను పట్టేసుకోవచ్చు అని అనుకున్న పోలీసులకు మిగిలిన వ్యక్తులు చుక్కలు చూపిస్తున్నారు. రష్యా నుండి భారత్ దాకా ఈ గేమ్ పాకిందంటే ఆ టీమ్ ప్రజలను ఎంతగా టార్చర్ పెట్టాలని అనుకుంటుందో మనకు ఇట్టే అర్థం అయిపోతుంది. భారత్ కు కూడా ప్రత్యేకంగా అడ్మిన్ లను పెట్టారా అన్న అనుమానం మొదలైంది. ఇటీవల కాలంలో భారత్ లో బ్లూ వేల్ మరణాలు అధికమవుతున్నాయి. చిన్న చిన్న టౌన్ లోని పిల్లలు కూడా ఈ గేమ్ ను ఆడుతున్నారు. వారి దాకా ఎలా ఈ గేమ్ వెళుతోందో త్వరగా కనిపెట్టాలి.. లేకపోతే ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయో..!

About the author

Related

JOIN THE DISCUSSION