ధోని.. పాదాభివంద‌నం..ఆటోగ్రాఫ్ ప్లీజ్‌!

మొహాలీలో భారత్‌-శ్రీలంక మధ్య రెండో వన్డే సాగుతోంది. టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా ఓ యువ‌కుడు గ్రౌండ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ధోనీ వైపు ప‌రుగులు పెట్టాడు. అత‌ణ్ణి గ‌మ‌నించిన పోలీసులు ప‌ట్టుకునే లోగా.. అత‌ను ధోనిని చేరుకున్నాడు.

నేరుగా వెళ్లి పాదాల మీద ప‌డ్డాడు. ధోనికి పాదాభివంద‌నం చేసి.. బాగా ఎమోష‌న్ అయ్యాడు. చేతిలో ఉన్న ప్ల‌కార్డు వెనుక ఆటోగ్రాఫ్ చేయాల‌ని అడిగాడు. ఈలోగా పోలీసాయ‌న వ‌చ్చి మ‌నోడి కాల‌ర్ ప‌ట్టుకుని వెన‌క్కి లాక్కెళ్లారు. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో రెండు జ‌ట్ల క్రికెట‌ర్లు అవాక్క‌య్యారు.

About the author

Related

JOIN THE DISCUSSION