ఆశ్చ‌ర్యం: ఆసీస్‌తో తొలి మూడు వ‌న్డేల్లో అశ్విన్‌, జ‌డేజా ఆడ‌ట్లేదు..!

ఆస్ట్రేలియాతో జరిగే తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ స్క్వాడ్‌లో స్పిన్న‌ర్ అశ్విన్‌, ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఎంపిక చేయ‌లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్, య‌జువేంద‌ర్ చాహ‌ల్‌ను తీసుకున్నారు.

ఆస్ట్రేలియాతో టీమిండియా మొత్తం అయిదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడబోతోంది. ప్రస్తుతం తొలి మూడు వన్డేలకు బీసీసీఐ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకూ ఆస్ట్రేలియా మ‌న‌దేశంలో ప‌ర్య‌టిస్తుంది. ఈ నెల 17న తొలి వ‌న్డే. చెన్నైలో రెండు జ‌ట్లూ తొలివ‌న్డేలో త‌ల‌ప‌డ‌బోతున్నాయి.

ఇదీ జ‌ట్టు. విరాట్ కోహ్లీ (కేప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, అజింక్యా రహానే, మనీశ్‌పాండే, కేదార్‌ జాదవ్‌, మ‌హేంద్ర‌సింగ్ ధోనీ (వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, య‌జువేంద‌ర్ చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ.

 

About the author

Related

JOIN THE DISCUSSION