చైనా బాక్సర్ ను చిత్తుచిత్తు చేశాడు.. ఇప్పుడు పతకం తిరిగి ఇచ్చేస్తానని అంటున్నాడు..!

ఒలింపిక్ పతక విజేత.. బాక్సర్ విజేందర్ సింగ్ తన టైటిల్ ను కావాలంటే వెనక్కు ఇచ్చేస్తానని తెలిపాడు. భారత్-చైనా మధ్య శాంతి అనేది ముఖ్యమని.. అందుకోసం కావాలంటే చైనా బాక్సర్ నుండి గెలిచిన టైటిల్ ను వెనక్కు ఇచ్చేస్తానని చెప్పాడు. శనివారం రాత్రి ముంబై వేదికగా జరిగిన బౌట్ లో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటయాలినినీ విజేందర్ సింగ్ ఓడించాడు. చైనా, భారత్ మధ్య ఉన్న డొక్లామ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా తన టైటిల్ ను వెనక్కి ఇచ్చేందుకు కూడా సిద్ధమంటూ విజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చైనా బాక్సర్ పై విజేందర్ సింగ్ గెలుపును భారత అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. అంతలోనే 31 సంవత్సరాల విజేందర్ సింగ్ ఇలాంటి మాటలు అనడం నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, డోక్లామ్ సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నానని, తన ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ ను ఇచ్చేందుకు సిద్ధమని తెలిపాడు.

 

About the author

Related

JOIN THE DISCUSSION