112 సంవత్సరాల తర్వాత ఆ జీవి మనదేశంలో కనబడింది..!

మనిషి చేస్తున్న పుణ్యకార్యాల వలన చాలా జీవులు ఇప్పటికే అంతరించిపోయాయి.. ఇంకొన్ని అంతరించే స్థితికి చేరుకున్నాయి. అయితే ఏకంగా 112 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఓ జంతువు మళ్ళీ మన వాళ్ళకు తారసపడింది. ‘ఇండియన్ మౌస్ డీర్’ అనే జీవి ఛత్తీస్ ఘడ్ అడవుల్లో హఠాత్తుగా తారసపడింది.

గరియాబంద్ జిల్లాలో పులుల లెక్కింపు కోసం పెట్టిన కెమెరాల్లో ఈ జీవి గడ్డి తింటూ కనిపించడంతో జంతుప్రేమికులు తెగ ఆనందపడిపోతున్నారు. దానికి ఇండియన్ మౌస్ డీర్ అనే పేరు రావడానికి ముఖ్య కారణం దానికి ఉన్న ముక్కు.. అలాగే దాని ఒంటి మీద ఉన్న చారలు. దాని ముక్కు అచ్చం ఎలుకను పోలి ఉంటుంది. ఇక ఒంటిపై చారలు మనదేశంలో కనిపించే జింకల లాగే ఉంటాయి. నోవా నేచర్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయని తెలిసింది. చివరిసారిగా దీని గురించి బ్రిటీష్ పాలకుల కాలంలో 1905లో చర్చించారు. ఆ తర్వాత ఇప్పటికి అవి మనదేశంలో బ్రతికే ఉన్నాయన్న నిజం తెలిసింది.

About the author

Related

JOIN THE DISCUSSION