ఓవ‌ర్సీస్‌లో బాహుబ‌లి-2 రికార్డు బ‌ద్ద‌ల‌వుతోందట‌గా!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌గ్గ‌రద‌గ్గ‌ర‌గా 2000 వేల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన సినిమా.. మ‌న తెలుగు మూవీ `బాహుబ‌లి: ది క‌న్‌క్లూజ‌న్‌`. ఈ రికార్డును ఇప్ప‌ట్లో ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేర‌ని అంచ‌నా వేశారు సినీ పండితులు. వారి అంచ‌నాలు త‌ల‌కిందులయ్యే రోజులు ఎంతో దూరం లేద‌నిపిస్తోంది.

ఎందుకంటే- హాలీవుడ్‌లో గ‌త‌వార‌మే రిలీజ‌యిన ఓ మూవీ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టేస్తోంది. అది ఓ హార‌ర్ సినిమా కావ‌డం విశేష‌మే మ‌రి. ఆ మూవీ పేరు `ఇట్‌..`ఇప్పుడు హాలీవుడ్‌లో స‌రికొత్త హార‌ర్ మూవీ ఇది. బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది.

రీసెంట్‌గా రిలీజైన ఇట్ అన్ని సినిమాల క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను బ్రేక్ చేస్తోంది. అమెరికాతో పాటు ప్ర‌పంచ దేశాల్లోనూ ఇట్ ఫిల్మ్ హార‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఈ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1350 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింద‌ట‌. ఒక్క అమెరికాలోనే వారం రోజుల్లో సుమారు 750 కోట్లు వ‌సూల్ చేసింద‌ని చెబుతున్నారు.

హాలీవుడ్ హ‌ర‌ర్ ఫిల్మ్ హిస్ట‌రీలో ఇదో కొత్త రికార్డు. స్టీఫెన్ కింగ్ రాసిన `ఇట్` న‌వ‌లను అదే పేరుతో తెర‌కెక్కించారు. ఇందులో న‌టించిన వారంద‌రూ చిన్న‌పిల్ల‌లే. రోటెన్ ట‌మోటాస్ సంస్థ ఈ ఫిల్మ్‌కు త‌న రివ్వ్యూలో 86 శాతం క్రెడిట్ ఇచ్చింది.

వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, న్యూ లైన్ సినిమా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. అమెరికాను ఇటీవ‌ల రెండు హ‌రికేన్లు దెబ్బ‌తీసినా.. ఇట్ మాత్రం ఆ దేశ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. క‌లెక్ష‌న్లు కూడా రోజురోజుకూ పెరుగుతుండ‌టంతో.. దాని ముందు ఏ ఒక్క సినిమా రికార్డు కూడా ఉండ‌బోద‌ని అంచ‌నా వేస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION