స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో జపాన్ ప్ర‌ధాని

జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి షింజో అబే భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆలింగ‌నం చేసుకుని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా విమానాశ్ర‌యంలోనే గౌరవ వందనం స్వీకరించారు జపాన్ ప్రధాని.

విమానాశ్ర‌యం నుంచి ఇద్దరు ప్రధాన మంత్రులు ర్యాలీగా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి త‌ర‌లి వెళ్లారు. ఓ విదేశీ ప్రధాన మంత్రి ఓపెన్ టాప్ జీప్‌లో ర్యాలీగా వెళ్లటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. ఏడు కిలోమీటర్ల దారి పొడవునా ప్రజలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.

సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న అనంత‌రం మోడీ.. అక్క‌డి వస్తువులను వివ‌రించారు. వాటికి ఉన్న ప్రాధాన్య‌త‌ను తెలియ‌జెప్పారు. భార్య కూడా ఉన్నారు. సబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.

About the author

Related

JOIN THE DISCUSSION