మొన్న షమీ వైఫ్.. నేడు కైఫ్

మొన్న షమీ వైఫ్.. నేడు కైఫ్

భారత క్రికెటర్ షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్నందుకు సోషల్ మీడియాలో చోటుచేసుకున్న రచ్చ అంతా ఇంతాకాదు. ఆ ఘటనను మరువక ముందే భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ను సోషల్ మీడియాలో తెగ తిట్టేస్తున్నారు. అందుకు కారణం సూర్య నమస్కారాలు వేయడమే.. కైఫ్ తాను సూర్య న‌మ‌స్కారాలు చేస్తున్న ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఫిట్‌నెస్‌కు ఇంతకంటే ఉత్త‌మమైన క‌స‌ర‌త్తులు లేవ‌ని పొగిడాడు.

 

ఈ పోస్టుపై ఎవరూ ఊహించని విధంగా ఇస్లాం మతానికి చెందిన కైఫ్ సూర్య నమస్కారాలు చేయడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఇస్లాం మ‌త సాంప్ర‌దాయాల‌ను ధిక్క‌రించ‌డ‌మే అవుతుంద‌ని, ఇలాంటి వివాదాస్ప‌ద కామెంట్ ఎందుకు చేస్తున్నావ‌ని కొందరు విమర్శించారు. ఈ వివాదంపై స్పందించిన కైఫ్ నేను పోస్ట్ చేసిన ప్రతి ఫోటోలో అల్లా లేకపోవచ్చు. కానీ ఆ సమయంలో అల్లా నా హృదయంలోనే ఉన్నాడు. వ్యాయామం చేసేటప్పుడు ఏం చేసినా మనకే మంచిదని సమాధానం ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *