నా భ‌ర్త‌తో డేటింగ్ చేసింది..కూతురు ఎలా అవుతుంది?

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రాజేసిన అగ్గి ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌ట్లేదు. యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఆదిత్య పంచోలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ ఆదిత్య పంచోలి మ‌రెవరో కాదు. విక్ట‌రీ వెంక‌టేష్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన షాడో సినిమాలో ప్ర‌ధాన విల‌న్ అత‌నే. ఈ ర‌కంగా అత‌ను మ‌న తెలుగు వారికి సుప‌రిచితుడే.

సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్త‌లో ఆదిత్య పంచోలి తనను తీవ్రంగా హింసించాడ‌ని, ర‌క్తం వ‌చ్చేలా కొట్టేవాడ‌ని అంటూ మొన్న‌టికి మొన్నే ఆరోప‌ణ‌లు గుప్పించింది కంగ‌నా. కూతురు కంటే చిన్న వయసున్న తనను అన్ని ర‌కాలుగా హింసించాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

పంచోలి బారి నుంచి త‌న‌ను కాపాడాల్సిందిగా ఆయ‌న భార్య జ‌రీనా వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్ప‌టికీ.. ఆమె ప‌ట్టించుకోలేద‌నీ చెప్పింది. ఈ ఆరోపణలపై జరీనా ఎట్ట‌కేల‌కు నోరు విప్పింది. కంగనా తన భర్తతో నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిందని.. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా భావిస్తామ‌ని ప్రశ్నించింది. తన తాజా మూవీ `సిమ్రన్` పబ్లిసిటీ కోసమే కంగనా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమ‌ర్శించింది.

మ‌రోవైపు- ఆదిత్య పంచోలి కూడా త‌న విమ‌ర్శ‌ల ప‌దును పెంచారు. ఆయ‌న ఏకంగా త‌న కుమార్తె స‌న పంచోలి ఆధార్‌కార్డును సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌న కుమార్తె స‌న వ‌య‌స్సుతో కంగ‌నా ఎలా స‌మాన‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించాడు. మాజీ బాయ్‌ప్రెండ్ హృతిక్ రోష‌న్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లోకెక్కిందామె.

About the author

Related

JOIN THE DISCUSSION