క‌న్న‌డ టీవీ న‌టి రేఖా సింధు దుర్మ‌ర‌ణం

క‌న్న‌డ టీవీ న‌టి రేఖా సింధు క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరు-చెన్నై జాతీయ ర‌హ‌దారిపై శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకున్న రోడ్డు ప్ర‌మాదంలో ఆమె మృత్యువాత ప‌డ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు తమిళనాడు వేలూరు జిల్లాలోని సున్నపకొట్టయ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. కారులో ప్ర‌యాణిస్తున్న రేఖా సింధుతో పాటు మ‌రో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.మిగతా ముగ్గురిని అభిషేక్‌ కుమారన్, జయ‌చంద్ర‌న్‌, రక్షణ్‌గా గుర్తించారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చికిత్స నిమిత్తం వారిని స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం వేలూరు ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ టీవీ సీనియ‌ల్ షూటింగ్‌లో పాల్గొన‌డానికి రేఖా సుధ బెంగ‌ళూరు నుంచి చెన్నైకి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.వారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీనివ‌ల్ల ప్రమాదం సంభ‌వించిన‌ట్లు వేలూరు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం స‌మ‌యంలో కారులో ఆరుగురు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన వారిలో ఇద్దరినీ వెల్లూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడం వల్లే దుర్ఘటన జరిగివుండొచ్చని అనుమానిస్తున్నారు.రేఖా సింధు తమిళ, కన్నడ టీవీ షోల్లో న‌టిస్తోంది. మొద‌ట ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది మ‌రో న‌టి రేఖా కృష్ణ‌ప్ప‌గా భావించారు. రోడ్డు ప్ర‌మాదంలో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు తొలుత వార్త‌లు వెలువ‌డ్డాయి. దీన్ని రేఖా కృష్ణ‌ప్ప తోసిపుచ్చారు. తాను సుర‌క్షితంగా ఉన్నాన‌ని, తన‌కెలాంటి ప్ర‌మాద‌మూ సంభ‌వించ‌లేద‌ని చెప్పారు. ఈ విష‌యాల‌ను ఆమె త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆమె శృంగేరీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అనంత‌రం- రేఖా సింధు మ‌ర‌ణించిన‌ట్లు ధృవీక‌రించారు.

About the author

Related

JOIN THE DISCUSSION