నాయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ

నాయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ

భార‌త క్రికెట్ జ‌ట్టు అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసింది. కేర‌ళ కుర్రాడు క‌రుణా నాయ‌ర్ త్రిబుల్ సెంచ‌రీ నాలుగో రోజు ఆట‌లో విశేషం. 7 వికెట్ల న‌ష్టానికి 759ప‌రుగుల వ‌ద్ద కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్సును డిక్లేర్ చేశారు. 32 బౌండ‌రీలు, 4 సిక్స‌ర్ల సాయంతో నాయ‌ర్ 303 ప‌రుగులు చేసి, అజేయంగా నిలిచారు.

 

అశ్విన్ 67, జ‌డేజా 59 ప‌రుగులు చేశారు. ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ ఒక్క‌ప‌రుగు తేడాలో డ‌బుల్ సెంచ‌రీ మిస్స‌య్యాడు. ఇంగ్లండ్ బౌల‌ర్లు డాస‌న్‌, బ్రాడ్‌మ‌న్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 12 ప‌రుగులు చేసింది. ఇన్నింగ్స్ ప‌రాజ‌యాన్ని త‌ప్పించుకోవాలంటే ఇంకా 258ప‌రుగులు చేయాలి. ఒత్తిడి త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారా లేక‌, కుప్ప‌కూలుతారా అనే విష‌యం మంగ‌ళ‌వారం మొద‌టి గంట‌లోనే తేలిపోతుంది. మూడో రోజు ఆట‌లో రాహుల్‌, నాలుగో రోజు ఆట‌లో నాయ‌ర్ బ్యాటింగ్‌తో ఇండియాను ప‌టిష్ట‌స్థితికి చేర్చారు. ఇండియా గెల‌వాలంటే ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాలి. గౌర‌వ‌ప్ర‌దంగా సిరీస్ ముగించాలంటే ఇంగ్లండ్ నిల‌బ‌డి డ్రా చేసుకోవాలి. భార‌త్ త‌ర‌ఫున ఇంత‌వ‌ర‌కూ వీరేంద్ర సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచ‌రీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *