తాడుకు అయస్కాంతం కట్టి లాగారు.. వారికి దొరికిన వస్తువు చూసి ఊరంతా హడలిపోయింది..!

తాడుకు ఆయస్కాతం కత్తి ఇనుప వస్తువులు ఏవైనా దొరుకుతాయేమోనని పిల్లలు తెగ వెతికేవారు. తాజాగా అలా ఓ ముగ్గురు పిల్లలు తాడు చివర అయస్కాంతం కట్టి ఏవైనా ఇనుప ముక్కలు దొరుకుతాయేమోనని ఆశపడ్డారు. అయితే వారికి దొరికిన ఆ వస్తువును చూసి ఆ ఊరి వాళ్ళంతా హడలిపోయారు. ఇంతకూ ఆ వస్తువు ఏంటో తెలుసా..? ఓ హ్యాండ్ గ్రెనేడ్..! చేషైర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

12ఏళ్ల ల్యూక్, తొమ్మిది సంవత్సరాల షార్లోట్, 16 సంవత్సరాల డియాన్ ఇవాన్స్ కలసి వారి ఊరిలో ఉన్న చిన్న కాలువ వద్దకు వెళ్ళారు. అక్కడ నీటిలో పడి ఉన్న ఇనుప ముక్కలను బయటకు తీయాలని ఓ ఆయస్కాంతాన్ని తాడు సాయంతో నీటిలోకి విసిరారు. వారికి ఓ లావు పాటి వస్తువు దొరికింది. వీరందరిలో పెద్ద వాడైన డియాన్ ఇవాన్స్ కు దాన్ని చూడగానే అనుమానం వచ్చింది.. వెంటనే ల్యూక్ తన తల్లి డాన్ కి ఫోటో పంపాడు. ఫోటో పంపగానే కంగారు పడిపోయిన డాన్ పిల్లలను దానికి దూరంగా ఉండమని చెప్పింది. డాన్ తన బావ అయిన మార్టిన్ కు ఫోటో చూపించగా అది ఓ హ్యాండ్ గ్రెనేడ్.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాడినదిగా గుర్తించాడు. అదీ కాకుండా దాని పిన్ కూడా తీసేయడంతో ఎప్పటికైనా పేలుతుందని భావించి చెస్టర్ పోలీసులకు సమాచారం అందించి పిల్లలు ఉన్న ప్రాంతానికి పరిగెత్తుకొని వెళ్ళి బాంబు నుండి దూరంగా తీసుకొని వచ్చారు.

ఈ విషయం తెలిసి ఆ ఊరి వాళ్ళు హడలెత్తిపోయారు. పోలీసులు ఆ ప్రాంతానికి రక్షణగా నిలిచి బాంబ్ స్క్వాడ్ ను రప్పించారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన బాంబ్ స్క్వాడ్ కొద్ది దూరం ఆ బాంబును తీసుకొని వెళ్ళి పేల్చేశారు. రష్యన్లు తయారు చేసిన హ్యాండ్ గ్రెనేడ్ లని తెలిసొచ్చింది. దానికి లెమన్ అన్న పేరును పెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది.. ఎవరికీ ఏమీ అవ్వలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION