సిరీస్ గెలవగానే అంతా అయిపోదు

సిరీస్ గెలవగానే అంతా అయిపోదు

చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన 5వ టెస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మ్యాచ్ కు ముందు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నారు. ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది అంత సులువైన విషయం కాదని.. ఎంతో కష్టపడితేనే ఐదు రోజుల ఫార్మాట్ లో విజయం సాధించగలమని తెలిపారు.

 

సిరీస్ గెలవగానే అంతా అయిపోదని.. ప్రతి మ్యాచ్ లోనూ విజయ సాధించడమే తమ లక్ష్యమన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో చెన్నైలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందా అని అందరూ భావించారు. అయితే అనుకున్న సమయానికే మ్యాచ్ ను ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో దివంగత తమిళనాడు సీఎం జయలలితకు క్రికెటర్లు నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *