మోడీకి గుండు కొట్టించిన వారికి..

మోడీకి గుండు కొట్టించిన వారికి..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి వ్య‌తిరేకంగా కోల్‌క‌త‌కు చెందిన ఓ ఇమాం జారీ చేసిన ఫ‌త్వా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఆ ఫ‌త్వా అలాంటిదిలాంటిది కాదు. మోడీకి గుండు గీయించినా, గ‌డ్డం తీసేసినా, ఆయ‌న‌పై ఇంకు చ‌ల్లినా 25 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారా ఇమాం. ఆయ‌న పేరు మౌలానా స‌య్య‌ద్ మ‌హ్మ‌ద్ నూరుర్ రెహ్మాన్ బ‌ర్కాతి. కోల్‌క‌త‌లోని టిప్పు సుల్తాన్ మ‌సీదు షాహి ఇమాం ఆయ‌న‌.

పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో మోడీ ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోస‌గిస్తున్నార‌ని, అందుకే ఈ ఫ‌త్వా జారీ చేసిన‌ట్లు బ‌ర్కాతి చెప్పుకొచ్చారు. కోల్‌క‌త ప్రెస్‌క్ల‌బ్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ఇద్రిస్ అలీ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బర్కాతి అప్ప‌టిక‌ప్పుడు జారీ చేసిన ఈ ఫ‌త్వాపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. బ‌ర్కాతిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. బ‌ర్కాతి అవ‌మానించింది ఒక్క మోడీని మాత్ర‌మే కాదని.. దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇది అవ‌మాన‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. దీనిపై పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *