షాక్‌! సీనియ‌ర్ తెలుగు న‌టుడి ప్రేమ‌లో న‌మిత‌..త్వ‌ర‌లో పెళ్లి?

న‌మ్మాలో.. లేదో తెలియ‌ట్లేదు గానీ త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లోన‌ది ఈ టాక్‌. అదే- సీనియ‌ర్ న‌టుడు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శ‌ర‌త్‌బాబు, త‌మిళ న‌టి న‌మిత ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం వినిపిస్తోన్న ఈ టాక్ అంతా పుకార్ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. కోలీవుడ్ మాత్రం కోడై కూస్తోంది.

 

విశ్వ‌సించ ద‌గ్గ కొన్ని త‌మిళ ఛాన‌ళ్లు, వెబ్‌సైట్లలో ఈ క‌థ‌నం చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌తంలో వెంక‌టేష్ స‌ర‌స‌న జెమిని సినిమా స‌హా కొన్ని తెలుగు సినిమాల్లో న‌టించింది న‌మిత‌. తెలుగులో ఆమె న‌టించిన తాజా చిత్రం- సింహ‌.

అందులో గెస్ట్ రోల్‌, ఓ సాంగ్‌లో అద‌ర‌గొట్టింది న‌మిత‌. బాగా లావుగా మార‌డంతో ఆమెకు సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి గానీ.. క్రేజ్ గానీ, గ్లామ‌ర్‌లో మార్పు లేదు. శ‌ర‌త్‌బాబు సీనియ‌ర్ న‌టుడు.

తెలుగు, త‌మిళంలో వంద‌ల సినిమాల్లో యాక్ట్ చేశారాయ‌న‌. సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత ఆ జంట విడిపోయి కూడా చాలా ఏళ్ల‌యింది. శ‌ర‌త్‌బాబు అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఇందులో సందేహాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు అవ‌కాశాలు లేవు.

న‌మిత‌తో శ‌ర‌త్‌బాబు ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌తో ఆయ‌న మ‌ళ్లీ టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యారు. ఇందులో ఏది వాస్త‌వ‌మో.. ఏది అవాస్త‌వ‌మో తెలుసుకోవ‌డానికి కొంతకాలం ఆగ‌క త‌ప్ప‌దు. ఈ వార్త‌ను ఎవ‌రో ఒక‌రు ఖండిస్తారు.

About the author

Related

JOIN THE DISCUSSION