అమ్మో! ఎంత పెద్ద పామో!

కింగ్ కోబ్రా. పేరుకు త‌గ్గ‌ట్టే `కింగ్‌..`దాని పొడ‌వు క‌నీసం 18 అడుగులు. అంత పెద్ద కింగ్ కోబ్రా క‌ల‌క‌లం రేపింది. శ్రీ‌కాకుళం జిల్లా కంచిలి మండ‌లంలో హ‌ల్‌చ‌ల్ చేసింది. కంచిలి మండలంలోని గిరిజ‌న గ్రామం బొగాబెణెలో ఓ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైందీ పాము.

ఈ గ్రామం.. మ‌హేంద్ర‌గిరుల‌కు ఆనుకుని ఉంటుంది. మ‌హేంద్ర గిరులు కింగ్ కోబ్రాల‌కు పెట్టింది పేరు. త‌ర‌చూ భారీ పాములు ఈ మ‌హేంద్ర గిరుల నుంచి జ‌న‌సంచారం మ‌ధ్య‌లోకి వ‌స్తుంటాయి. ఇది కూడా అలాగే వ‌చ్చి ఉంటుంద‌ని స్థానికులు చెబుతున్నారు.

బొగాబెణెలోని ఓ గిరిజ‌నుడు ఇంట్లో క‌నిపించిన ఈ పామును చూసిన వారికి పైప్రాణాలు పైనే పోయాయి. బిక్క‌చ‌చ్చిపోయారు. వెంట‌నే వీధిలోకి ప‌రుగెత్తారు. పామును చంప‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. దాని బుస‌లు విని ఆ ప‌ని విర‌మించుకున్నారు.

అనంత‌రం స‌ర్పాల సంర‌క్ష‌కుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. వారు వ‌చ్చి ఈ పామును ప‌ట్టుకున్నారు. అనంత‌రం బీల అట‌వీ ప్రాంతంలో వ‌దిలివేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION