చిరు అభిమానుల‌పై లాఠీచార్జి

చిరు అభిమానుల‌పై లాఠీచార్జి

పోలీసులా! మ‌జాకా!! చిరంజీవి 150వ చిత్రం బెనిఫిట్ షో వేయాల్సిందేనని ప‌ట్టుబ‌ట్టిన మెగాస్టార్ అభిమానుల‌కు పోలీసులు లాఠీల దెబ్బ‌ను రుచిచూపించారు. చెద‌ర‌గొట్టారు. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరులో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణంలో ఈ సినిమా బెనిఫిట్ షోకు అనుమ‌తివ్వ‌లేదు.

మార్నింగ్ షో నుంచే చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని అధికార యంత్రాంగం ప్ర‌క‌టించింది. ఆమేర‌కు థియేట‌ర్ వ‌ద్ద బ్యాన‌ర్ కూడా ఏర్పాటు చేశారు. అయినా చిరు అభిమానులు థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరారు. బెనిఫిట్ షో వేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. పోలీసులు రంగంలో దిగి వారిని చెద‌ర‌గొట్టేందుకు లాఠీచార్జి చేశారు. కొంద‌రు అభిమానుల‌కు గాయాల‌య్యాయి. అంతే వారి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. క‌నిపించిన రాళ్ళందుకుని పోలీసు వాహ‌నాల‌పై రువ్వారు. వాహ‌నాల అద్దాలు ప‌గిలిపోయాయి. ఇందుకు కార‌ణ‌మైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *