మ‌రొక‌రి భార్య‌ను ప్ర‌పోజ్ చేశాడు.. ఆమె నో అన‌డంతో!

ఎవ‌రైనా త‌మ‌కు న‌చ్చిన యువ‌తిని ప్రపోజ్ చేస్తారు. ఇద్ద‌రికీ న‌చ్చితే ప్రేమించుకుంటారు. ధైర్యం ఉంటే దాన్ని పెళ్లిదాకా తీసుకెళ్తారు. ఈ యువ‌కుడు మాత్రం అంద‌ర్లా కాకుండా కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించిన‌ట్టున్నాడు.

అందుకే- ఆరు నెల‌ల కింద‌టే పెళ్ల‌యిన ఓ యువ‌తి ముందు ప్రేమ ప్ర‌తిపాద‌న ఉంచాడు. షాక్ తిన్న ఆమె..వెంట‌నే నో చెప్పేసింది. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెంగ‌ళూరు శివార్ల‌లోని స‌ర్జాపుర‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌.

స‌ర్జాపురకు చెందిన ఆ యువ‌కుడి పేరు వెంక‌టేష్. వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. బుధ‌వారం నుంచి వెంక‌టేష్ క‌నిపించ‌కుండా పోయాడు. అదేరోజు సాయంత్రం త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేశాడు. తాను స‌ర్జాపుర రోడ్డు ప‌క్క‌న ఉన్న చెరువు వ‌ద్ద ఉన్న‌ట్లు చెప్పారు.

దీనితో- వారు వెంక‌టేష్ చెప్పిన ప్ర‌దేశానికి వెళ్ల‌గా.. అక్క‌డ అత‌నికి చెందిన చెప్పులు క‌నిపించాయి. ఆ త‌రువాత ఎంత వెదికినా వెంక‌టేష్ క‌నిపించ‌కపోవ‌డంతో అత‌ని త‌ల్లిదండ్రులు స‌ర్జాపుర పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌నే అనుమానంతో అగ్నిమాప‌క ద‌ళాల‌ను పిలిపించి, గాలించారు. వ‌ర్షం రావ‌డంతో గాలింపును ఆపేసిన పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది గురువారం మ‌రోసారి అన్వేషించారు.

ఉద‌యం చెరువులో వెంక‌టేష్ మృత‌దేహం క‌నిపించింది. అత‌ని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణం ప్రేమ విఫ‌లం కావ‌డ‌మేన‌ని ద‌ర్యాప్తులో తేలింది.

ఆరు నెల‌ల కింద‌టే పెళ్ల‌యి కొత్త‌గా స‌ర్జాపుర ప్రాంతానికి కాపురానికి వ‌చ్చిన ఓ యువ‌తిపై వెంక‌టేష్ మ‌న‌సు ప‌డ్డాడ‌ని, ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌గా నిరాక‌రించింద‌ని చెబుతున్నారు. అందుకే- ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION