స్కూల్ డ్రస్ వేసుకొని పార్క్ లో అబ్బాయితో ఉన్న అమ్మాయి.. పోలీసులు వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే..!

పార్కులు.. నగరమేదైనా సరే.. కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే కాస్త భయపడతారు ఎవరైనా..! ఎందుకంటే తుప్పల్లో, పొదల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎన్నో పాడు పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రేమ పక్షులు అంతా పెళ్ళి దాకా వెళ్ళే జంటలు కాదు. తమ కోర్కెలను తీర్చుకోడానికి ఇలా పార్కులను వాడుకుంటూ ఉంటాయి. హైదరాబాద్ అయినా.. బెంగళూరు అయినా.. విజయవాడ అయినా.. కొందరికి పార్కుల్లో ఇదే పని..! తాజాగా భోపాల్ లో కనీసం 16 సంవత్సరాలు కూడా దాటని అమ్మాయిలు పార్క్ లో అబ్బాయిలతో కలసి ముద్దుల్లో మునిగిపోయారు. పోలీసులు అక్కడికి వెళ్ళగానే తమకు ఏ పాపం తెలియనట్లు నటించారు.

మహిళా పోలీసుల కథనం ప్రకారం.. ఎందఱో అమ్మాయిలు స్కూళ్ళకు.. కాలేజీలకు వెళుతున్నామని ఇంట్లో చెబుతారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా అబ్బాయిలతో పార్కుల బాట పడుతున్నారు. అలా అమ్మాయిలు దొరకగానే అబ్బాయిలు ముద్దులతో ముంచెత్తుతున్నారు. ఎన్నో జంటలు పోలీసులు వెళ్ళగానే భోపాల్ లోని చీనార్ పార్కులో బయటపడ్డాయి. వారిని పట్టుకున్న పోలీసులు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలు చదువుకోడానికి వెళ్ళకుండా పార్కుల్లో తిరుగుతున్నారు అని సమాచారం ఇచ్చారు. అమ్మాయిల కళ్ళు తెరిపించడానికి తాము ఈరోజు పార్కుకు వచ్చామని మహిళా పోలీసులు తెలిపారు. అమ్మాయిలు తొందరగా మోసపోతారని.. మగపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చదువును వదిలిపెట్టి ఇలా పార్కుల్లో తిరిగితే భవిష్యత్తు నాశనం అవుతుందని వారు హితవు పలికారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్ళకు పంపించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంటే వద్దని పోలీసులను ఎంతగానో బ్రతిమలాడుకున్నారు.. అయినప్పటికీ పోలీసులు అమ్మాయిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ పిలిపించారు. ఇక అబ్బాయిలకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు.

About the author

Related

JOIN THE DISCUSSION