పోస్ట‌ర్ చెబుతోన్న క‌థ‌: `టాయ్‌లెట్‌.. ఎవ‌డి అవ‌స‌రం వాడిది..`

`టాయ్‌లెట్‌..ఎవ‌డి అవ‌స‌రం వాడిది! ఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదండి బాబూ! ఇలాంటి సినిమాలు ఎన్ని తీసినా.. మ‌న అవ‌స‌రం మ‌న‌దే అనే సందేశాన్ని ఇస్తున్నాడీ యువ‌కుడు. `టాయ్‌లెట్‌.. ఏక్ ప్రేమ్‌క‌థ‌..! ఈ నెల 11న విడుద‌ల కానున్న బాలీవుడ్ మూవీ ఇది.

 

ఈ సినిమా ఉద్దేశ‌మేంటో టైటిలే చెప్పేస్తుంది. భార‌త్‌ను స్వ‌చ్ఛంగా ఉంచండ‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా. స్వ‌చ్ఛ‌భార‌త్ అవ‌స‌రాన్ని, వ్య‌క్తిగ‌త‌, ప్ర‌జావ‌స‌రాల మ‌రుగుదొడ్ల ఉప‌యోగాన్ని చెబుతూ ఏకంగా ఓ క‌మ‌ర్షియ‌ల్ మూవీనే తెర‌కెక్కించారు. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ఈ సినిమా.. ఇదిగో ఇలా త‌యారైంది. మ‌న అవ‌స‌రాలు మ‌నవి.

స్వ‌చ్ఛ‌భార‌త్ అంటూ దేశ ప్ర‌ధాని చీపురు ప‌ట్టుకుని రోడ్ల‌ను ఊడ్చినా ప‌ట్టించుకోం. కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాలు తీసినా మ‌నం మార‌బోం. ఈ సినిమా తీయ‌డం శుద్ధ దండ‌గ అనే సందేశాన్ని ఇస్తున్నాడీ యువ‌కుడు.

https://twitter.com/Bees_Kut/status/894904394117816320

About the author

Related

JOIN THE DISCUSSION