కూతురికి ఐఫోన్ 8 కొనివ్వడం కోసం తండ్రిపడిన కష్టం..!

ఐఫోన్ 8 విడుదలకు సిద్ధమైంది. యాపిల్ ఫోన్ ప్రియులు దానికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కూతురికి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఓ వ్యక్తి ఏకంగా భారత్ నుండి సింగపూర్ కి వెళ్ళడం విశేషం. 13 గంటలపాటు క్యూలో నిలబడి యాపిల్ ఐఫోన్ 8 ను కొని తనకూతురికి పెళ్ళి గిఫ్ట్ గా అందించాడు.

భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమిన్‌ అహ్మద్‌ ధోలియా కూతురు కూడా యాపిల్ ఫోన్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేది. ఆమెకు పెళ్ళి కానుకగా ఇద్దామని భారత్ నుండి సింగపూర్ కి వెళ్ళాడు. 43 సంవత్సరాల అమిన్ రెండు సెల్ ఫోన్లను కొనడానికి ఆర్చర్డ్ రోడ్ లోని ఐఫోన్ స్టోర్ ముందు నిలబడ్డాడు. ఉదయం 8 గంటలకు స్టోర్ తెరవగానే ఫోన్లు కొనుక్కుని భారత్ కు తిరుగుప్రయాణం అయ్యాడు. తాను జీవితంలో మొద‌టిసారి రాత్రంతా క్యూలో 200 మందితో క‌లిసి నిలబడ్డానని.. ఐఫోన్ లు కొనడం ఆనందంగా ఉందని.. కానీ రాత్రంతా నిలబడడమే కాస్త కష్టంగా ఉందని అమిన్ చెప్పాడు.

About the author

Related

JOIN THE DISCUSSION