బోరుబావిలో ఇలా ఎందుకు దిగాడో తెలిస్తే..సెల్యూట్ చేయ‌కుండా ఉండ‌లేరు..!

మూత‌లేని బోరుబావులు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో మ‌న‌కు తెలుసు. అందులో ప‌డి ఎంతోమంది చిన్నారులు విగ‌త జీవుల‌య్యారు. దేశంలో ఎక్క‌డో ఓ చోట త‌ర‌చూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూనే వ‌స్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. బోరుబావిలో ప‌డింది చిన్నారి కాదు. ఓ మేక‌. ఆ మేక‌ను ర‌క్షించ‌డానికి కొంద‌రు వ్య‌క్తులు ఇలా ప్రాణాలను ప‌ణంగా పెట్టారు.

మేక‌ను స‌జీవంగా ర‌క్షించ‌గ‌లిగారు. క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పురా జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌టన ఇది. గ‌డ్డి మేయ‌డానికి వ‌చ్చిన ఓ మేక‌ వ్య‌వ‌సాయ పొలంలో మూత లేకుండా వ‌దిలేసిన బోరు బావిలో ప‌డింది. సుమారు ప‌ద‌డుగుల లోతులో ఇరుక్కుంది. దాని అరుపులు విన్న స్థానికులు బోరుబావి వ‌ద్ద‌కు చేరుకున్నారు.

10 నుంచి 12 అడుగుల లోపే ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. దాన్నెలాగైనా కాపాడాల‌ని నిర్ణ‌యించారు. ఈ సాహ‌సానికి పూనుకున్నారు. మొద‌ట ఓ యువ‌కుడు బోరుబావిలో త‌ల‌కిందులుగా దిగ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. అత‌ని వల్ల కాలేదు. దీనితో మ‌రో వ్య‌క్తి ముందుకొచ్చాడు. త‌ల‌కిందులుగా బోరుబావిలోకి దిగాడు.

అత‌ని స్నేహితులు ఆ వ్య‌క్తి కాళ్ల‌ను ప‌ట్టుకుని మెల్లిగా బోరుబావిలోకి దింపారు. బోరుబావిలో పాద‌ల వ‌ర‌కూ వెళ్లిపోయాడు. కొంత సేప‌టి త‌రువాత ఆ వ్య‌క్తి మేక చెవుల‌ను ప‌ట్టుకుని దాన్ని బ‌య‌టికి లాక్కొచ్చాడు. బ‌య‌టికి రావ‌డ‌మే ఆల‌స్యం- బ‌తుకు జీవుడా అన్న‌ట్టు గెంతులేస్తూ ప‌రుగులు తీసిందా మేక‌. ఓ సెక్యూరిటీ గార్డు ఈ సాహ‌సాన్ని వీడియో తీశాడు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

About the author

Related

JOIN THE DISCUSSION