కుమారుడిని అమ్మేసి..క‌రో క‌రో జ‌ర జ‌ల్సా!

త‌న కుమారుడిని అమ్మేసిన ఓ వ్య‌క్తి ఆ సొమ్ముతో జ‌ల్సా చేశాడు. 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే.. ఆ డ‌బ్బును ఖాళీ చేసేశాడు. ఖ‌రీదైన సెల్‌ఫోన్ కొన్నాడు..తాగి తంద‌నాలాడాడు. ఒడిశాలోని భద్రక్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ వ్య‌క్తి పేరు బ‌ల‌రామ్ ముఖి. అత‌ను స్వీప‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. మ‌ద్యానికి బానిస‌. అత‌నికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మూడో సంతానంగా ఓ బాబు పుట్టాడు. మ‌ద్యానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో తన 11 నెలల మగబిడ్డను 23 వేల రూపాయ‌ల‌కు ఓ వృద్ధ దంప‌తుల‌కు అమ్మేశాడు. దీనికి అత‌ని బావమరిది, ఓ అంగన్‌వాడీ కార్యకర్తతో స‌హాయం చేశారు. ఈ వ‌చ్చిన డ‌బ్బులో 2000 రూపాయ‌ల‌తో సెల్‌ఫోన్ కొన్నాడు. 1500 రూపాయ‌ల‌తో కుమార్తెకు వెండి కడియాలు కొనుగోలు చేశాడు.

మిగతా మొత్తాన్ని మద్యానికి ఖర్చుచేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బలరాంను అరెస్ట్‌ చేశారు. అతని భార్య సుకుటిని కూడా ప్రశ్నించారు. బాలుడిని కొనుగోలు చేసిన వృద్ధ దంప‌తుల‌ను కూడా పోలీసులు విచారించారు. బాలియా అనే ఆంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త ద్వారా త‌న‌కు బ‌ల‌రామ్ ముఖి ప‌రిచ‌యం అయ్యాడ‌ని బాబును కొన్న సోమనాథ్‌ సేథి చెప్పారు.

ప్రభుత్వ సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. ఆ దంపతుల ఏకైక కుమారుడు 2012లో మృతిచెందాడు. దీంతో అతడి భార్య తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయింది. ఆమెను మళ్లీ సాధారణ స్థితికి తీసుకుని రావ‌డానికి ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించాన‌ని వివరించారు. బాలియా ఈ విషయాన్ని బలరాంకు చెప్పగా తన 11 నెలల శిశువును విక్రయించేందుకు సిద్ధపడ్డాడని పోలీసులు వివరించారు.

About the author

Related

JOIN THE DISCUSSION