పైశాచికం: భార్య జ‌న‌నాంగాల‌పై ఇస్త్రీపెట్టెతో..!

అద‌న‌పు క‌ట్నం వేధింపుల ఘ‌ట‌న‌లో ఇంత‌కంటే దారుణం మ‌రొక‌టి ఉండ‌దేమో! అర్ధ‌రాత్రి పూట నిద్రిస్తున్న భార్య‌ను లేపి, ఆమెతో ఘ‌ర్ష‌ణ‌కు దిగి, విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టిన ఓ భ‌ర్త ఉదంతం ఇది. అక్క‌డితో త‌న కోపం చ‌ల్లార‌ని ఆ కిరాత‌కుడు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించాడు. ఎల‌క్ట్రిక‌ల్ ఇస్త్రీ పెట్టెతో ఆమె జ‌న‌నాంగాల‌పై వాత‌లు పెట్టాడు.

కాళ్లూ, చేతుల‌పైనా వాత‌లు పెట్టాడు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ బాధిత మ‌హిళ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ కిరాత‌క ఘ‌ట‌న బెంగ‌ళూరులోని బాణ‌స‌వాడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని లింగ‌రాజ‌పురంలో చోటు చేసుకుంది. ఆ దుర్మార్గుడి పేరు దిలీప్‌కుమార్‌. దిలీప్‌కుమార్ త‌న భార్య‌తో క‌లిసి లింగ‌రాజపురంలో నివ‌సిస్తున్నాడు.

ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చాడు దిలీప్‌కుమార్‌. అద‌న‌పు క‌ట్నం తీసుకుని రావాలంటూ మ‌రోసారి భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. ఇద్ద‌రి మ‌ధ్యా వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత 2 గంట‌ల‌కు నిద్ర‌పోతున్న భార్య లేపి, మ‌ళ్లీ ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు.

విచ‌క్ష‌ణార‌హితంగా ఆమెను కొట్టాడు. అక్క‌డితో కోపం చ‌ల్లార‌ని దిలీప్‌.. ఇస్త్రీ పెట్టె తీసుకుని కాళ్లూ, చేతుల‌పై వాత‌లు పెట్టాడు. కాలిన గాయాల‌తో విల‌విల్లాడుతున్నప్ప‌టికీ ప‌ట్టించుకోలేదు. రాక్ష‌సుడిలా మారాడు. ఆమె జ‌న‌నాంగాల‌పైనా ఇస్త్రీపెట్ట‌తో వాత‌లు పెట్టాడు.

దీనితో ఆమె సొమ్మ‌సిల్లింది. ఆమెను అలాగే వ‌దిలేసి తెల్ల‌వారు జామున ఇంటి నుంచి పారిపోయాడు. సోమ‌వారం ఉద‌యం ఆమె ప‌రిస్థితిని గుర్తించిన స్థానికులు అంబేద్క‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స్థానికుల ఫిర్యాదు మేర‌కు బాణ‌స‌వాడి పోలీసులు నిందితునిపై ఐపీసీ సెక్ష‌న్ 326 కింద కేసు న‌మోదు చేశారు. అత‌ణ్ణి అరెస్టు చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION