భ‌ర్త బోర్ కొడుతున్నాడ‌ని..ఓ భార్య దారుణం!

పెళ్ల‌యిన మూడేళ్ల‌కే భ‌ర్త బోర్ కొట్టాడ‌ట‌. అందుకే ఓ భార్య దారుణానికి పాల్ప‌డింది. భ‌ర్త ముఖాన్ని చూసి, చూసీ బోర్ కొట్టి.. వేరే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించింది. త‌న భార్య ప్రవర్తనలో వచ్చిన ఈ అనూహ్య మార్పును చూసిన ఆ భర్త తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యాడు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ను ఆశ్ర‌యించాడు.

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వయసున్న ఓ మ‌హిళకు మూడేళ్ల కింద‌ట పెళ్ల‌యింది. అత‌నికి 29 సంవ‌త్స‌రాలు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అవసరం లేకపోయినప్ప‌టికీ ఆమె ఉద్యోగానికి వెళ్తుండ‌టం, త‌న‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ భ‌ర్త‌కు అనుమానం వ‌చ్చింది.

ఆమెపై నిఘా వేశాడు. దీనితో ఆమె గుట్టుర‌ట్ట‌యింది. ఓ వ్యక్తితో ఆమె అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగిస్తోన్న విష‌యం వెల్ల‌డైంది. అత‌నితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి షాక్‌కు గురయ్యాడత‌ను. దీనిపై అత‌ను నిల‌దీయ‌గా- నీతో బోర్‌కొడుతోందని, అందుకే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను’ అని తెగేసి చెప్పింది.

అత‌ణ్ణి రెండో పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న‌ట్టు కూడా స్ప‌ష్టం చేసింది. దీనిపై అత‌ను త‌న భార్య‌ను ఎంత మంద‌లించిన‌ప్ప‌టికీ.. మార్పు రాలేదు. దీనితో అత‌ను న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాడు. విడాకులు కావాలని కోరాడు. వాదోప‌వాదాల‌ను విన్న త‌రువాత కోర్టు విడాకులు జారీ చేసింది. భార్యాభర్తలు విడిపోయారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION