బ‌హిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెలిపై..!

రాత్రివేళ బ‌హిర్భూమి కోసం వెళ్లిన మైన‌ర్ అక్కాచెల్లెలిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ సంఘటన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని బన్నూనగారియా గ్రామానికి చెందిన 15, 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న మైన‌ర్ అక్కాచెల్లెలు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో బహిర్భుమికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో వారికి ఎదురుప‌డిన ముగ్గురు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అడ్డుకొని పొదల్లోకి ఎత్తుకెళ్లారు.

బాలికలు కేక‌లు వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. త‌మ వ‌ద్ద ఉన్న నాటు తుపాకుల‌తో వారిని కొట్టారు. కాల్చి పారేస్తామ‌ని బెదిరించారు. అనంతరం సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వారిని అక్కడే వదిలి పరారయ్యారు. కాసేపటికి ఇంటికి చేరిన బాధిత బాలిక‌లు ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేశారు. వెంట‌నే వారు మ‌ద‌న్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక‌ల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దుండగుల దాడిలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని మ‌ద‌న్‌పూర్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఓమ్‌ ప్రకాశ్‌ గౌతమ్ తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION