రియ‌ల్ లైఫ్ `ఘాజీ`: ఆమె ఎలా చ‌నిపోయిందంటే..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ చనిపోయిన ఉదంతం ఘాజీ సినిమాలోని స‌న్నివేశాల‌ను త‌ల‌పించింది. ఆమె ఓ జ‌ర్న‌లిస్ట్‌. ఆమె పేరు కిమ్ వాల్‌. స్వీడ‌న్‌కు చెందిన టాప్ మీడియా హౌస్‌లో ఆమె ప‌నిచేస్తోంది. ఈ నెల 11వ తేదీన ఆమె అదృశ్య‌మైంది. ఆ త‌రువాత శ‌వ‌మై క‌నిపించింది. ఆమె మ‌ర‌ణించిన ఉదంతం మ‌న ఘాజీ మూవీని త‌ల‌పిస్తోంది.

ఘాజీలో మ‌న‌దేశ జ‌లాంత‌ర్గామికి కేప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌ణ్‌వీర్ సింగ్ ఎలా మ‌ర‌ణించాడో అచ్చు అలాగే ఈ జ‌ర్న‌లిస్ట్ కూడా చ‌నిపోయింది. స‌ముద్ర ఉప‌రిత‌లానికి 250 మీట‌ర్ల లోతులో, ఓ ప్రైవేటు జ‌లాంత‌ర్గామిలో ఆమె ప్ర‌మాదానికి గురైంది. అక్క‌డే తుదిశ్వాస విడించింది. ఆమె మృత‌దేహాన్ని జ‌లాంత‌ర్గామి సిబ్బంది స‌ముద్రంలో జార విడిచారు.

ఈ విష‌యాన్ని ఆ జ‌లాంత‌ర్గామిని త‌యారు చేసిన ప్రైవేటు సంస్థ య‌జ‌మాని పీట‌ర్ మ్యాడ్‌స‌న్ తెలిపారు. స‌ముద్రంలో గుర్తు తెలియ‌ని ప్ర‌దేశంలో కిమ్ వాల్ మృత‌దేహాన్ని స‌ముద్రంలోనే వ‌దిలిపెట్టిన‌ట్టు ఆయ‌న న్యాయ‌స్థానం ముందు చెప్పారు.

మ్యాడ్‌స‌న్‌కు చెందిన సంస్థ రూపొందించిన ప్రైవేటు జ‌లాంత‌ర్గామి గురించి క‌థ‌నాన్ని రాయ‌డానికి ఆమె అందులోకి వెళ్లారు. డెన్మార్క్‌లో ఆ సంస్థ కొన‌సాగుతోంది. 17 మీట‌ర్ల పొడ‌వు ఉండే ఈ జ‌లాంత‌ర్గామి ఈ నెల 11వ తేదీన కోజె బే స‌ముద్ర తీరంలో జ‌ల‌ప్ర‌వేశం చేసింది.

ఇక అంతే- జ‌లాంత‌ర్గామి పైకి వ‌చ్చిందే త‌ప్ప కిమ్‌వాల్ రాలేదు. ఆమె ఏమైంద‌నే విష‌యాన్ని మొద‌ట మ్యాడ్‌స‌న్ బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌నివ్వ‌లేదు. తీరా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చేట‌ప్ప‌టికి అత‌ను స్పందించాడు. జ‌లాంత‌ర్గామిలో సంభ‌వించిన ప్ర‌మాదంలో కిమ్‌వాల్ మ‌ర‌ణించింద‌ని, ఆమె మృత‌దేహాన్ని స‌ముద్రంలోనే వ‌దిలిపెట్టిన‌ట్టు చెప్పాడు.

About the author

Related

JOIN THE DISCUSSION