న‌డిరోడ్డుపై కిక్ బాక్సింగ్‌

రష్యాలో దారుణం చోటు చేసుకుంది. జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సాధించిన ఓ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్‌ను కొట్టి చంపారు. ఆ కొట్టి చంపిన వ్య‌క్తి మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుడు. త‌న టాలెంట్‌ను ఆ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్‌పై చూపించాడు. త‌న‌దైన శైలిలో పంచ్‌లో ఇచ్చాడు. దీనితో ఆ ప‌వ‌ర్ లిఫ్ట‌ర్ సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించాడు.

ర‌ష్యాలోని ఖ‌బ‌రోవ్‌స్కీ న‌గ‌రంలో ఈ ఘ‌టన‌..ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఎందుకు ఘ‌ర్ష‌ణ ప‌డ్డారో తెలియ‌ట్లేదు గానీ.. సీన్ చూస్తోంటే మాత్రం ఇద్ద‌రూ ఉద్దేశ‌పూర‌కంగానే స్ట్రీట్ ఫైటింగ్ దిగిన‌ట్టు క‌నిపిస్తోంది.

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్ అన‌ర్ జిర‌నోవ్‌, ప‌వ‌ర్ లిఫ్ట‌ర్ ఆండ్రెయ్ డ్ర‌చెవ్ మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఇద్ద‌రూ ఫైటింగ్‌కు దిగారు. అన‌ర్ జిర‌నోవ్ గాల్లో ఎగురుతూ కాలితో ఇచ్చిన కిక్‌కు డ్ర‌చెవ్ ఎగిరి కింద ప‌డ్డాడు.

ప‌డ్డ వ్య‌క్తిని మ‌ళ్లీ లేవ‌కుండా పంచ్‌ల మీద పంచ్‌లు విసిరాడు. దీనితో డ్ర‌చెవ్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్‌లా మారింది. డ్ర‌చెవ్ ర‌ష్యా తురుపుముక్క. జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో అత‌ను ప‌వ‌ర్ లిఫ్టింగ్ విభాగ‌లో పోటీ ప‌డేవాడు. గ‌త ఏడాది జ‌రిగిన అంత‌ర్జాతీయ ప‌వ‌ర్ లిఫ్టింగ్ పోటీల్లో అత‌ను బంగారు ప‌త‌కాన్ని సాధించాడు.

https://youtu.be/pvqe1MOxHFQ

About the author

Related

JOIN THE DISCUSSION