అస‌లే టికెట్ లేని ప్ర‌యాణం.. పైగా కాలు మీద కాలేసుకుని.. ద‌ర్జా

ఓ మర్క‌టానికి రైల్లో ప్ర‌యాణించాల‌నే స‌ర‌దా పుట్టింది. అనుకున్న‌దే త‌డ‌వుగా చిటారు కొమ్మ మీది నుంచి ఒక్క గెంతు గెంతి.. మెట్రో రైలు ఎక్కేసింది.. టికెట్ లేకుండా.! అస‌లే టికెట్ లేని ప్ర‌యాణం.. గ‌మ్మున ఉండ‌కుండా బోగీల‌న్నీ చుట్టేసింది.

ప్ర‌యాణికుల‌కూ హ‌లో చెప్పుకుంటూ తిరిగేసింది. ప్ర‌యాణికుల‌ను బెదిరించడం.. ప‌ళ్లు ఇకిలించ‌డం వంటి కోతి చేష్ట‌లేవీ చేయ‌కుండా బుద్ధిగా..అటు ఇటూ తిరిగింది. పాపం! తిరిగి తిరిగీ కాలు నెప్పెట్టిందేమో! సీట్లో కాలు మీద కాలేసుకుని ద‌ర్జాను ఒల‌క‌బోసింది.

ఢిల్లీ మెట్రో రైలులో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. బాటా చౌక్‌ మెట్రో స్టేషన్‌లో రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులతో పాటు కోతి కూడా ఎక్కేసింది. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

About the author

Related

JOIN THE DISCUSSION