పాపం రేసులో పెట్రోల్ అయిపోయింది.. తోసుకుంటూ వెళ్ళి మరీ పాయింట్లు సంపాదించాడు..!

మోటో జీపీ రేసులు ఎంత ఉత్కంఠగా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెకెన్ల తేడాతో స్థానాలు మారిపోతుంటాయి. రేసులో సాధించే ప్రతి ఒక్క పాయింటూ ఎంతో ముఖ్యం. చివరి ల్యాప్ లో అయితే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. విజయాన్ని నిర్ణయించే చివరి ల్యాప్ లో పెట్రోల్ అయిపోతే.. ఆ రేసర్ బాధ వర్ణణాతీతం. అచ్చం అలాంటి ఘటనే శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ లో చోటుచేసుకుంది.

27 సంవత్సరాల జోహాన్ జార్కో చివరి ల్యాప్ లో వెళుతుండగా అతని బైక్ లో పెట్రోల్ అయిపోయింది. అయితే అతను తన బైక్ ను తోసుకుని ఫినిషింగ్ లైన్ వరకూ వెళ్ళడం ప్రేక్షకులను అలరించింది. ఏదో సినిమాలో క్లైమాక్స్ లో లాగా సాగిన ఈ రేస్ లో జార్కో పాయింట్లు సంపాదించాడు. యమహా టెక్ 3 బైక్ బరువు 160 కిలోలు దాన్ని తోసుకుంటూ ఫినిషింగ్ లైన్ దాకా వెళ్ళాడు. తోసుకుంటూ వెళ్ళి పదిహేనో స్థానంలో నిలిచాడు. పెట్రోల్ అయిపోకుండా ఉండి ఉంటే ఏడో ర్యాంకు జార్కో సాధించి ఉండేవాడు.

About the author

Related

JOIN THE DISCUSSION