సెన్సార్ బోర్డు స‌భ్యుడి మాట‌: జై ల‌వ‌కుశ ఎలా ఉంటుందంటే..!

టీజ‌ర్‌తో హైప్ క్రియేట్ చేసి, ట్రైలర్‌తో దాన్ని అమాంతం పెంచేసిన సినిమా జై ల‌వ‌కుశ‌. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న విడుదల కాబోతోంది. బుధవారం ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

సినిమా టాక్ ఏంటో, ఎలా ఉంటుంద‌నేదీ సెన్సార్ బోర్డు స‌భ్యుడొక‌రు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారట‌. ఉమేర్ సంధు అనే ఓ ఫిల్మ్ క్రిటిక్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు. ఆ సెన్సార్‌బోర్డు స‌భ్యుడి పేరు చెప్ప‌లేదు.

గానీ.. త‌న‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం.. అంటూ జై ల‌వ‌కుశ‌ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అని, ఇండ‌స్ట్రీ హిట్ కొడుతుంద‌ని ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన సమాచారం మేరకు.. జై లవకుశ మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ విజృంభించార‌ని ఆయన చెప్పారు.

https://twitter.com/sandhumerry/status/907570259296755712

About the author

Related

JOIN THE DISCUSSION