పాఠ‌శాల‌కు రావట్లేద‌ని.. టీచ‌ర్ ఘాతుకం!

పాఠ‌శాల‌క రావ‌ట్లేద‌నే కార‌ణంతో ఓ ఉపాధ్యాయుడు అయిదుమంది విద్యార్థుల‌పై ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. వారి ముఖాల‌కు న‌ల్ల‌రంగు పులిమి ఊరంతా ఊరేగించాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విష‌యం జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి వ‌చ్చేంత వ‌ర‌కూ.. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దంటే ఏమ‌నుకోవాలి?

ఈ నెల 6వ తేదీన సింగ్రౌలి జిల్లాలో దేవ్‌స‌ర్ బ్లాక్ ప‌రిధిలోని ఒబారిలో ఉన్న మాధ్యమిక పాఠశాలలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయిదుమంది విద్యార్థులు రెండు రోజులుగా పాఠ‌శాల‌కు వెళ్ల‌ట్లేదు. వివిధ కార‌ణాల ఈ అయిదుమంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు వెళ్ల‌లేక‌పోయారు. అస‌లు కార‌ణం తెలుసుకుని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు ఉపాధ్యాయుడు ప్ర‌జాప‌తి.

క్లాసుల‌ను ఎగ్గొట్టార‌నే కార‌ణంతో ఆ విద్యార్థుల ముఖాలకు మసి పూసి గ్రామంలో తిప్పాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్ర‌జాప‌తిని నిల‌దీశారు. ఈ విష‌యాన్ని వారు పాఠ‌శాల‌ ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్ర‌జాప‌తిపి లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు చేశారు.

ప్ర‌ధానొపాధ్యాయుడు దీనిపై స్పందించ‌లేదు. ప్ర‌జాప‌తిపై ఎలాంటి చ‌ర్యా తీసుకోలేదు. దీనితో త‌ల్లిదండ్రులు సింగ్రౌలి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ చౌధరికి వివ‌రించారు. దీనికోసం వారు పిల్లల‌ను వెంట‌బెట్టుకుని జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి వెళ్లారు. అప్పుడే ఈ వ్య‌వ‌హారం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. దీనిపై క‌లెక్ట‌ర్ అనురాగ్ చౌధురి విచార‌ణ‌కు ఆదేశించారు.

About the author

Related

JOIN THE DISCUSSION