ధోనీ రెండో రన్ చేసేటప్పుడు పరిగెత్తే వేగం ఎంతో తెలుసా..?

వేరే దేశాలకు చెందిన ఆటగాళ్ళు ఎప్పుడు బౌండరీలు బాదుదామా అని ఎదురుచూస్తుంటారు. అదే భారత ఆటగాళ్ళు మాత్రం బౌండరీలు బాదుతూ వీలైనంతగా పరుగులు కూడా తీద్దామని అనుకుంటుంటారు. సచిన్ టెండూల్కర్ కు మిగిలిన ఆటగాళ్ళకు తేడా ఏమిటంటే అదేనని చెప్పేవారు విశ్లేషకులు.

సచిన్ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరిస్తూనే.. పరుగులు కూడా అద్భుతంగా తిరిగేవాడు. అందుకే అతనికి చిచ్చరపిడుగు అనే పేరు ఉండేది. ఇక సచిన్ తర్వాత ధోని, కోహ్లీలు కూడా వికెట్ల మధ్య అద్భుతంగా రన్నింగ్ చేస్తూ ఉంటారు.

రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో ధోని ఎంత వేగంగా పరిగెత్తుతాడో తెలుసుకుందామని చూశారు. అతడి వేగం చూసి అందరూ షాక్ అయ్యారు. మ్యాచ్‌లో రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కి.మీ.ల వేగంతో ఆయ‌న ప‌రిగెత్తాడు. ధోనీ ర‌న్నింగ్ విశ్లేష‌ణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. `ధోనీ ర‌న్నింగ్‌ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు` అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. ధోని ఒలింపిక్స్ లో పాల్గొని ఉంటే భారత్ కు రన్నింగ్ లో పతకం అయినా వచ్చేది కదా అని అభిమానులు అంటున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION