ఇదే కొత్త 50 రూపాయల నోటా..?

గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత కొత్త 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశ పెట్టారనుకోండి. కానీ అప్పటి నోట్ల రద్దు వలన వచ్చిన సమస్య ఏమిటంటే పెద్ద నోట్లకు చిల్లర దొరక్కపోవడం. ఇప్పుడు చిల్లర బాధలను తీర్చడానికి మరో కొత్త నోటును తీసుకురానున్నారని వార్తలు వస్తున్నాయి.

కొత్త 50 రూపాయల నోటు రానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నీలం రంగుతో ఉన్న 50 రూపాయలకు సంబంధించిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వాటి మీద గాంధీ బొమ్మ.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కు సంబంధించిన సంతకం కూడా ఉండడంతో త్వరలో అఫీషియల్ గా ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

About the author

Related

JOIN THE DISCUSSION