పాపం.. హార్దిక్ పాండ్యాను అనవసరంగా తిట్టారు.. ఆమె వయసు 28.. పాండ్యా వయసు 23..!

హార్దిక్ పాండ్యా ఏదో ఓ ట్వీట్ చేశాడు.. అంతమాత్రాన అతనికి పరిణీతి చోప్రాకు ప్రేమాయణం అంటూ పుకార్లు సృష్టించారు. క్రికెట్ మీద ధ్యాస పెట్టు మొదట.. అప్పుడే ఎందుకు నీకు ప్రేమ అని చీవాట్లు పెట్టారు. ఇదంతా హార్దిక్ శ్రీలంకలో ఉన్నప్పుడు చోటుచేసుకుంది. భారత్ కు వచ్చిన తర్వాత హార్దిక్ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ అనవసరంగా తనను తిట్టిపోశారని బాధను వెళ్ళగక్కాడు.

పరిణీతి చోప్రా ఒక హీరోయిన్ గా మాత్రమే తనకు తెలుసునని పర్సనల్ గా అసలు తెలియదని స్పష్టం చేశాడు. ఆమెతో తాను సరిగ్గా మాట్లాడింది కూడా లేదని, తాను శ్రీలంకలో ఉన్న సమయంలో ఈ ట్వీట్ గొడవ నడిచిందని వివరణ చెప్పాడు. తనకు ఎవరితో ఎఫైర్ అంటగట్టినా లెక్కచేయబోనని, ఈ విషయంలో చెప్పేందుకు ఇంకేమీ లేదని అన్నాడు. ఈ వ్యవహారంపై పరణీతి కూడా స్పందించింది. తాను హార్దిక్ పాండ్యా.. ప్రేమించుకోవడం ఏంటని మండిపడింది. అంతే కాదు పరిణీతి చోప్రా వయసు 28 అని.. హార్దిక్ పాండ్యా వయసు 23 మాత్రమేనని ఎంతో గొప్ప కెరీర్ ముందు పెట్టుకొని.. ఈ ప్రేమలు ఏంటని కూడా అన్నవారు ఉన్నారు. ఇంకొందరు అయితే సచిన్ తనకంటే పెద్దదైన అంజలిని చేసుకోలేదా అంటూ ఉదాహరణలు కూడా చూపించారు. అసలు ప్రేమనే లేదని చెబుతుంటే.. ఈ పోలికలు ఏంటో..!

About the author

Related

JOIN THE DISCUSSION